Zomato: శాకాహారం ఆర్డర్ చేస్తే మాంసాహారం డెలివరీ.. జొమాటోకు భారీ ఫైన్!

  • షణ్ముఖ్ అనే లాయర్ కు చికెన్ డెలివరీ
  • శాకాహారానికి బదులు మాంసాహారం అందజేయడంపై కోర్టు సీరియస్
  • రూ. 55 వేల జరిమానా

ఒకటి ఆర్డర్ ఇస్తే మరొకటి సర్వ్ చేసినందుకు జొమాటోతో పాటు ఆ ఆహారాన్ని సరఫరా చేసిన హోటల్ కు వినియోగదారుల కోర్టు భారీ జరిమానా విధించింది. వివరాల్లోకి వెళ్తే, పూణేకు చెందిన షణ్ముఖ్ దేశ్ ముఖ్ అనే లాయర్ జొమాటో యాప్ ద్వారా ఆన్ లైన్లో పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ చేశారు. అయితే, పన్నీర్ బటర్ మసాలా కాకుండా బటర్ చికెన్ ను ఆయనకు డెలివరీ చేశారు. చూడ్డానికి పన్నీర్ మాదిగానే ఉండటంతో దాన్ని ఆయన తినేశారు. ఆ తర్వాత అది చికెన్ అనే విషయం ఆయనకు అర్థమయింది. దీంతో జొమాటోతో పాటు సదరు హోటల్ పై వినియోగదారుల కోర్టులో పిటిషన్ వేశారు. కేసును విచారించిన కోర్టు శాకాహారానికి బదులు మాంసాహారాన్ని అందించినందుకు జొమాటోతో పాటు హోటల్ కు రూ. 55వేల జరిమానా విధించింది. 45 రోజుల్లోగా ఈ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది.

Zomato
Chicken
Paneer
Consumer Court
Fine
Pune
  • Loading...

More Telugu News