Alli Aravind: భారీ స్థాయిలో రూపొందనున్న 'రామాయణ'
- మళ్లీ తెరపైకి 'రామాయణం'
- 'రామాయణ' టైటిల్ తో 3 భాషల్లో నిర్మాణం
- 3D వెర్షన్ లో ప్రేక్షకుల ముందుకు
రమణీయమైన ఇతిహాసంగా 'రామాయణం' తెలుగువారి మనసులను దోచుకుంది. అలాంటి రామాయణం కథా వస్తువుగా వచ్చిన సినిమాలు చాలా వరకూ భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. అలాంటి రామాయణ కథ ఈ సారి అత్యంత భారీస్థాయిలో వెండితెరపై ఆవిష్కృతం కానుంది.
'రామాయణ' పేరుతో ఈ సినిమాను నిర్మించడానికి అల్లు అరవింద్ .. మధు మంతెన .. నమిత్ మల్హోత్ర రంగంలోకి దిగారు. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో 3 భాగాలుగా 3D వెర్షన్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 'దంగల్' దర్శకుడు నితేశ్ తివారీ .. 'మామ్' దర్శకుడు రవి ఉదయవర్ ఈ సిరీస్ కి దర్శకులుగా వ్యవహరించనున్నారు. 'రామాయణ' మొదటిభాగం 2021లో విడుదల కానున్నట్టుగా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. దేశంలోని వివిధ భాషల నుంచి నటీనటులను ఎంపిక చేస్తారు.