Rahul Gandhi: కొకైన్ సాక్ష్యాల కోసం రాహుల్ గాంధీకి డోపింగ్ పరీక్షలు నిర్వహించి ఉండాల్సింది!: బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి

  • రాహుల్ కొకైన్ వాడుతారన్న సుబ్రహ్మణ్య స్వామి
  • అందుకే కాంగ్రెస్ భ్రష్టు పట్టిందని వ్యాఖ్య
  • ఛత్తీస్ గఢ్ లో కేసు నమోదుచేసిన పోలీసులు

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కొకైన్ తీసుకుంటారనీ, ఆ మత్తులో పార్టీని నడపడంతోనే కాంగ్రెస్ నాశనమైపోయిందని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో ఛత్తీస్ గఢ్ పోలీసులు సుబ్రహ్మణ్య స్వామిపై కేసు నమోదుచేశారు.

అయితే తనపై పోలీసులు కేసు నమోదు చేయడంపై సుబ్రహ్మణ్య స్వామి విస్మయం వ్యక్తం చేశారు. పోలీసులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్ స్టుపిడ్ అనీ, రాహుల్ గాంధీకి పోలీసులు డోపింగ్ పరీక్ష నిర్వహించలేదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీకి డోపింగ్ పరీక్ష నిర్వహించి ఉంటే వాస్తవం బయటకు వచ్చేదని వ్యాఖ్యానించారు.

Rahul Gandhi
Congress
chattisgargh
Police
case
dope test
  • Loading...

More Telugu News