: బాలింతలపై రాష్ట్ర ప్రభుత్వ కనికరం


రాష్ట్ర ప్రభుత్వం బాలింతలను కనికరించింది. పేదల అభివృద్ది పట్ల నిబద్ధతతో పనిచేస్తున్నామంటూ గప్పాలు కొడుతున్న కాంగ్రెస్ పార్టీ తాజాగా ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గర్భవతులుగా ఆసుపత్రుల్లో చేరేందుకు 108 అంబులెన్సులను ఉపయోగిస్తున్న ప్రజలు, తిరిగి పచ్చిబాలింతలుగా బస్సుల్లోనో, ఆటోల్లోనో తమ ఇళ్ళకు చేరుతున్నారు. దీంతో బాలింతలు తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారు. అందుకే వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రభుత్వం 150 అంబులెన్సు వాహనాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సేవలందించే ఈ వాహనాలు ప్రభుత్వాసుపత్రులకు అనుబంధంగా పని చేస్తాయి.

  • Loading...

More Telugu News