Kumaraswamy: ప్రత్యేక విమానంలో బెంగళూరు చేరుకున్న కుమారస్వామి... నేరుగా స్టార్ హోటల్ కు పయనం!

  • కర్ణాటకలో రాజకీయ కల్లోలం
  • అమెరికా నుంచి హుటాహుటీన వచ్చేసిన కుమారస్వామి
  • తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్లో జేడీఎస్ ఎమ్మెల్యేలతో భేటీ

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో, అమెరికా పర్యటనలో ఉన్న సీఎం కుమారస్వామి హుటాహుటీన బెంగళూరు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బెంగళూరు వచ్చిన ఆయన నేరుగా నగరంలోని తాజ్ వెస్ట్ ఎండ్ స్టార్ హోటల్ కు పయనం అయ్యారు. అప్పటికే అక్కడికి చేరుకున్న జేడీఎస్ ఎమ్మెల్యేలతో సమావేశమై తాజా పరిస్థితులపై చర్చించారు. రాజకీయ కల్లోలానికి దారితీసిన పరిస్థితులను జేడీఎస్ సీనియర్ నేతలను అడిగి తెలుసుకున్నారు.

మరోవైపు, తమ పార్టీ ఎమ్మెల్యేలను మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాకుండా, తమ ఎమ్మెల్యేలను నగరంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ కు తరలించింది. వారికోసం ఏకంగా 35 రూములను బుక్ చేశారు.

Kumaraswamy
Karnataka
Congress
JDS
BJP
  • Loading...

More Telugu News