Andhra Pradesh: రాష్ట్రంలో జరుగుతున్న దాడులు సీఎం జగన్ కు కనిపించడం లేదా?: టీడీపీ నేత కళా వెంకట్రావు

  • రాష్ట్రంలో అరాచక పాలనకు వైసీపీ సిద్ధపడింది
  • రెండొందలకు పైగా దాడులు జరిగాయి
  • ఇప్పటికే మా కార్యకర్తలు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు

ఏపీలో వైసీపీ పాలనపై టీడీపీ నేత కళా వెంకట్రావు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అరాచక పాలనకు వైసీపీ సిద్ధపడిందని, ఈ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండు వందలకు పైగా దాడులు జరిగాయని మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తల దాడుల్లో ఇప్పటికే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని, రాష్ట్రంలో జరుగుతున్న దాడులు సీఎం జగన్ కు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. వైసీపీ మూకలు బరితెగించి దాడులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం చంద్రబాబుకు భద్రత తగ్గించారని విమర్శించారు.

Andhra Pradesh
ys
cm
jagan
Telugudesam
kala
  • Loading...

More Telugu News