Telangana: సచివాలయంలోని పోచమ్మగుడి, మసీదును ఎలా కూలుస్తారు?: రేవంత్ రెడ్డి

  • కేసీఆర్ తన మూఢ విశ్వాసాలను ప్రజలపై రుద్దుతున్నారు
  • ప్రభుత్వం ఆస్తుల రక్షణ బాధ్యత గవర్నర్ దే 
  • గవర్నర్ స్పందించకపోతే రాజ్ భవన్ ని ముట్టడిస్తాం

సీఎం కేసీఆర్ తన మూఢ విశ్వాసాలను ప్రజలపై రుద్దుతున్నారని టీ-కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లోని నిర్వహించిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, సచివాలయంలోని పోచమ్మగుడి, మసీదును ఎలా కూలుస్తారు? అని ప్రశ్నించారు. ఈ నిర్మాణాల విషయంలో జోక్యం చేసుకోలేమని కోర్టులు చెప్పడమంటే బాధ్యతల నుంచి అవి తప్పుకోవడమేనని విమర్శించారు. సచివాలయం, అసెంబ్లీ కూల్చివేత అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చని చెప్పిన రేవంత్ రెడ్డి, ప్రభుత్వం ఆస్తుల రక్షణ బాధ్యత గవర్నర్ దేనని అన్నారు. ఈ విషయమై గవర్నర్ స్పందించకపోతే రాజ్ భవన్ ని ముట్టడిద్దామని, గవర్నర్ ను కూడా బాధ్యుడ్ని చేసి కోర్టులో పిటిషన్ వేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News