Mob Lynching: మూకుమ్మడి దాడులకు ఇవి రెండే కారణం: దిగ్విజయ్ సింగ్

  • తమకు న్యాయం జరగడం లేదనే ఆగ్రహంతో ప్రజలు ఉన్నారు
  • బీజేపీ, ఆరెస్సెస్ సిద్ధాంతాలు కూడా దీనికి కారణం
  • ఆకాశ్ విజయవర్గీయ చేసిన వ్యాఖ్యలు దీనికి నిదర్శనం

దేశంలో పలుచోట్ల పలువురు వ్యక్తులపై మూకుమ్మడి దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. పలు కారణాల వల్ల ఇవి చోటు చేసుకుంటున్నాయి. వీటిపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందించారు. మూకుమ్మడి దాడులకు రెండు కారణాలు ఉన్నాయని ఆయన తెలిపారు. తమకు న్యాయం జరగడం లేదనే ఆగ్రహంతో ప్రజలు ఉన్నారని... మూకుమ్మడి దాడులకు ఇది ప్రధాన కారణమని చెప్పారు. బీజేపీ, ఆరెస్సెస్ లు ప్రజల మనసుల్లోకి చొప్పిస్తున్న సిద్ధాంతాలు రెండో కారణమని తెలిపారు. ఇటీవల క్రికెట్ బ్యాటుతో మున్సిపల్ అధికారులపై దాడి చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ విజయవర్గీయ చేసిన 'ఆవేదన్, నివేదన్ ఆ తర్వాత ధనాధన్' వ్యాఖ్యలు దీనికి నిదర్శనమని చెప్పారు. మూకుమ్మడి దాడులకు పాల్పడే వారి మైండ్ సెట్ కు ఇదొక నిదర్శనమని అన్నారు.

Mob Lynching
Digvijay Singh
Congress
Akash Vijayvargiya
BJP
  • Loading...

More Telugu News