Kadapa District: సోలార్ ప్లేట్లను ధ్వంసం చేసిన వ్యక్తుల ఆవేదన

  • కడప జిల్లాలో సోలార్ ప్లేట్ల ధ్వంసం
  • నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • జీవనాధారం కోల్పోయామనే బాధతోనే ఈ పని చేశామన్న నిందితులు

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరం మండలంలో జూన్ 30వ తేదీ రాత్రి సోలార్ ప్లేట్లను కొందరు వ్యక్తులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు డీఎస్పీ కోలా కృష్ణన్ మాట్లాడుతూ, కేసులో భాగంగా మద్దిరెడ్డిపల్లెకు చెందిన నాగుల రమేశ్, రామచంద్రాయపల్లెకు చెందిన నాగార్జున, సుబ్బరాయుడు, ఎర్రబల్లె గంగరాజులను అరెస్ట్ చేశామని చెప్పారు. నిందితుల నుంచి రెండు మోటార్ సైకిళ్లు, రెండు గొడ్డళ్లు, ఒక సుత్తి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

మరోవైపు నలుగురు నిందితులు మాట్లాడుతూ, తమ భూములను సోలార్ ప్రాజెక్ట్ వారు తీసుకున్నారని... కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమను ఉద్యోగాల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవనాధారం కోల్పోయామనే బాధతోనే విధ్వంసానికి పాల్పడ్డామని చెప్పారు.

Kadapa District
Solar Plates
Arrest
Jammalamadugu
  • Loading...

More Telugu News