NRI: అమెరికాలో తెలుగు ఎన్నారై దుర్మరణం

  • జలపాతంలో పడి ప్రకాశం జిల్లాకు చెందిన నూనె సురేశ్ మృతి
  • కుటుంబంతో సహా విహారయాత్రకు వెళ్లిన వైనం
  • తీవ్రవిషాదంలో కుటుంబ సభ్యులు

అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న ఓ తెలుగు ఎన్నారై దుర్మరణం పాలయ్యాడు. ప్రకాశం జిల్లాకు చెందిన నూనె సురేశ్ డల్లాస్ లోని సింటెల్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. సురేశ్ కు భార్య, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే, ఫ్యామిలీతో కలిసి ఓ జలపాతం వద్దకు విహారయాత్రకు వెళ్లిన సురేశ్ ప్రమాదవశాత్తు మృతిచెందాడు. జలపాతంలో పడిపోవడంతో నీటమునిగి ప్రాణాలు వదిలాడు. సురేశ్ మృతితో అతడి కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కాగా, సురేశ్ మృతదేహాన్ని ప్రకాశం జిల్లాలోని అతని స్వగ్రామానికి తరలించేందుకు అవసరమైన సొమ్ము కోసం అమెరికాలోని తెలుగు సంఘాలు నిధుల సేకరణ చేపట్టాయి.

NRI
USA
Nune Suresh
Prakasam District
  • Loading...

More Telugu News