Sarees: కరీంనగర్‌లో రూ.10కే చీర అంటూ షాపింగ్ మాల్ ప్రకటన.. పోటెత్తిన మహిళలు, తొక్కిసలాట

  • ఆషాఢం ఆఫర్‌ను ప్రకటించిన షాపింగ్ మాల్
  • భారీగా తరలి వచ్చిన మహిళలు
  • తొక్కిసలాటలో నలుగురు మహిళలకు గాయాలు

పది రూపాయలకే చీర అంటూ ఓ షాపింగ్ మాల్ నిర్వాహకులు ఆషాఢం ఆఫర్‌ను ప్రకటించడంతో మహిళలు పోటెత్తారు. దీంతో తొక్కిసలాట జరిగి పలువురికి గాయాలైన ఘటన కరీంనగర్‌లో జరిగింది. ఆషాఢ మాసం సందర్భంగా భ్రమరాంబిక షాపింగ్ మాల్ నిర్వాహకులు పది రూపాయలకే చీర అందించనున్నట్టు ప్రకటించారు. దీంతో చుట్టు పక్కల గ్రామాల నుంచి సైతం మహిళలు భారీగా షాపింగ్ మాల్‌కు తరలి వచ్చారు. అంతా ఒక్కసారిగా చీరల కోసం ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. దీంతో నలుగురు మహిళలకు గాయాలయ్యాయి.

Sarees
Karimnagar
Bramarambika Shopping mall
Women
  • Loading...

More Telugu News