Uttar Pradesh: కూతురి అశ్లీల ఫొటోలు వైరల్ అయ్యాయని ఉరేసుకున్న తండ్రి... గుండె ఆగి మరణించిన చిన్నాన్న!

  • ఉత్తరప్రదేశ్ లోని మీరట్ సమీపంలో ఘటన
  • ప్రేమ వివాహాన్ని అంగీకరించని పెద్దలు
  • అమ్మాయితో ఉన్న చిత్రాలను వైరల్ చేసిన యువకుడు

తన కుమార్తె, ఆమె ప్రియుడి సన్నిహిత ఫొటోలు వైరల్ కావడంతో, తట్టుకోలేకపోయిన ఓ తండ్రి ఉరేసుకుని మరణించగా, విషయం తెలిసిన ఆయన తమ్ముడు గుండాగి మరణించిన హృదయ విదారక ఘటన ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ జిల్లా, కౌలా గ్రామంలో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన ఓ యువతికి, అదే గ్రామానికి చెందిన మరో యువకుడికి మధ్య గత కొంతకాలంగా ప్రేమాయణం నడుస్తోంది.

మూడు నెలల క్రితం విషయం పెద్దలకు తెలియగా, గొడవ జరిగింది. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో, కేసు పెట్టిన పోలీసులు, యువకుడి కుటుంబంలోని ముగ్గురిని అరెస్టు చేసి జైలుకు పంపగా, వారు ఇటీవలే బెయిల్ పై వచ్చారు. ఆ తరువాత కూడా ఇరు కుటుంబాల మధ్యా గొడవలు జరిగాయి. ఈ క్రమంలో వారిద్దరూ సన్నిహితంగా ఉన్న చిత్రాలు, గ్రామంలోని గ్రూప్ లలో, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇవి చూసిన అమ్మాయి తండ్రి, తీవ్ర ఆందోళనకు గురై, గ్రామం సమీపంలోని అడవిలో ఓ చెట్టుకు ఉరేసుకున్నాడు. తన సోదరుని మరణ వార్తను విన్న ఆయన తమ్ముడు గుండెపోటుకు గురై ప్రాణాలొదిలాడు. ఇద్దరి మరణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Uttar Pradesh
Viral Photos
Sucide
Police
Lovers
  • Loading...

More Telugu News