Amitabh Bachchan: సూపర్ ఐడియా.. హైదరాబాద్ ట్రాఫిక్ సిగ్నల్స్‌పై అమితాబ్ బచ్చన్

  • హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రయోగంపై బిగ్‌బీ స్పందన
  • సూపర్ అంటూ కితాబు
  • కేబీర్ పార్క్ చౌరస్తాలో నేలపైనే ట్రాఫిక్ లైట్లు

హైదరాబాద్ ట్రాఫిక్ సిగ్నల్స్‌పై బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్పందించాడు. సూపర్ ఐడియా అంటూ కితాబిచ్చాడు. ఈ ఆలోచన చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని ప్రశంసిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ సిగ్నల్స్‌కు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇటీవల ట్రాఫిక్ సిగ్నల్స్ విషయంలో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సిగ్నల్ లైట్లను నేలకు దించి రోడ్డుపైనే ఏర్పాటు చేశారు. అనలాగ్, డిజిటల్ ల్యాబ్ సహకారంతో బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు కూడలి వద్ద వీటిని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. దీనివల్ల వాహనదారులు జీబ్రాక్రాసింగ్‌ను దాటి వెళ్లలేరు. కూడళ్ల వద్ద ట్రాఫిక్ సాఫీగా సాగిపోవడంతోపాటు ప్రమాదాల నియంత్రణకు అడ్డుకట్ట పడుతుందని, సిగ్నల్ జంపింగ్స్ తగ్గుతాయని పోలీసులు భావిస్తున్నారు. త్వరలోనే వీటిని నగరమంతా విస్తరించనున్నారు.

Amitabh Bachchan
Hyderabad traffic police
signal lights
  • Loading...

More Telugu News