New Zealand: వరల్డ్ కప్ లో సెమీస్ చేరిన నాలుగో జట్టు ఇదే!

  • సమీకరణం సాధించడంలో పాక్ విఫలం
  • న్యూజిలాండ్ కు సెమీస్ బెర్త్
  • ఇప్పటికే సెమీఫైనల్లో అడుగుపెట్టిన ఆసీస్, భారత్, ఇంగ్లండ్

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ సెమీఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో 316 పరుగుల భారీ తేడాతో నెగ్గితే సెమీస్ బెర్తు కైవసం అవుతుందన్న నేపథ్యంలో, పాక్ జట్టు 315 పరుగులు మాత్రమే చేయడంతో ఆ జట్టుకు సెమీస్ చాన్స్ గల్లంతు కాగా, న్యూజిలాండ్ ను అదృష్టం వరించింది. టోర్నీ మొదటి దశలో అద్భుతంగా రాణించి, ఆపై వరుస పరాజయాలు మూటగట్టుకున్న కివీస్, పాక్ వైఫల్యం కారణంగా సెమీస్ లో అడుగుపెట్టారు. కాగా, టోర్నీలో మొట్టమొదట సెమీస్ చేరినట్టు ఆస్ట్రేలియా కాగా, ఆ తర్వాత టీమిండియా, ఇంగ్లాండ్ సాధికారికంగా నాకౌట్ దశకు చేరాయి. ఇప్పుడు నాలుగో జట్టుగా న్యూజిలాండ్ కూడా టోర్నీ తదుపరి దశలో ప్రవేశించింది.

New Zealand
World Cup
Semi Final
  • Loading...

More Telugu News