Union Budget: కోటీశ్వరులకు వడ్డింపు.. ఆదాయపు పన్ను పెంపు: కేంద్ర బడ్జెట్

  • రూ. 2 నుంచి 5 కోట్ల వరకు ఆదాయం ఉన్నవారికి 3 శాతం పన్ను పెంపు
  • రూ. 5 కోట్ల పైన ఆదాయం ఉన్నవారికి 7 శాతం పన్ను పెంపు
  • పెట్రోల్, డీజిల్ పై ఒక్క రూపాయి అదనపు ఎక్సైజ్ డ్యూటీ

కేంద్ర బడ్జెట్లో అల్పాదాయ వర్గాలకు ఊరట కలిగింది. ఏడాదికి రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపును కలిగించారు. రూ. 5 లక్షలపైన ఆదాయం ఉన్నవారు ఇన్ కమ్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఇదే సమయంలో కోటీశ్వరులపై పన్ను పెంచారు. రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు ఆదాయం ఉన్నవారికి 3 శాతం పన్నును పెంచారు. రూ. 5 కోట్ల పైన ఆదాయం ఉన్న వారికి పన్నును 7 శాతంకి పెంచారు.

రూ. 5 కోట్ల కంటే తక్కువ టర్నోవర్ ఉన్న ఆదాయపన్ను చెల్లింపుదారులు ఇకపై మూడు నెలలకు ఒకసారి జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేయాలి. మరోవైపు రోడ్లు, మౌలికవసతుల కల్పన కోసం లీటర్ పెట్రోల్, డీజిల్ పై ఒక్క రూపాయి అదనపు ఎక్సైజ్ డ్యూటీని విధిస్తున్నట్టు ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు.

Union Budget
Income Tax
Petrol
Diesel
Nirmala Seetharaman
  • Loading...

More Telugu News