Andhra Pradesh: ఇసుకపై జగన్ ప్రభుత్వం నూతన విధానం.. సెప్టెంబరు 5 నుంచి అమలు

  • నూతన ఇసుక విధానంపై జగన్ సమీక్ష
  • ఇసుక విక్రయ బాధ్యతలు ఏపీఎండీసీకి
  • ఇసుక రవాణా వాహనాలకు జీపీఎస్ పరికరాల ఏర్పాటు

నూతన ఇసుక విధానంపై మంత్రులు, అధికారులతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబరు 5 నుంచి నూతన ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. అప్పటి వరకు ఇసుక సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యతను కలెక్టర్లకు అప్పగించారు.

నూతన విధానంలో ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ఇసుకను విక్రయించనుంది. ప్రస్తుతం లభిస్తున్న ధర కంటే మరింత చవగ్గా విక్రయించాలని, ఫలితంగా ప్రభుత్వంపై విమర్శలు రాకుండా చూడాలని జగన్ సూచించినట్టు సమాచారం. అలాగే, పట్టణాలు, నగరాల్లో అదనంగా ఇసుక నిల్వ పాయింట్లను ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇసుక రవాణా వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు చేయడం ద్వారా మాఫియాకు అడ్డుకట్ట వేయవచ్చని అన్నారు. ఇసుకను అక్రమంగా తవ్వి తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.  

  • Loading...

More Telugu News