west Indies: ఇదే నా చివరి ప్రపంచకప్.. ఇక నా శరీరాన్ని కష్టపెట్టదలచుకోలేదు: గేల్ భావోద్వేగం

  • విజయంతో ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన విండీస్ 
  • ప్రపంచకప్ గెలిచి ఉంటే సంతోషించేవాడిని 
  • ఈ ప్రయాణం ఎన్నో మధుర జ్ఞాపకాలు మిగిల్చిందన్న గేల్ 

ప్రపంచకప్‌లో భాగంగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విండీస్ గెలిచి ప్రపంచకప్ నుంచి విజయంతో నిష్క్రమించింది. మ్యాచ్ అనంతరం విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. ఇదే తన చివరి ప్రపంచకప్ అని పేర్కొన్నాడు. ఐదు ప్రపంచకప్‌లకు ప్రాతినిధ్యం వహించడాన్ని గౌరవంగా భావిస్తున్నానన్న గేల్.. తమ జట్టు ప్రపంచకప్‌ను గెలిచి ఉంటే మరింత సంతోషంగా ఉండేదన్నాడు.

క్రికెట్‌లో తన ప్రయాణం ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చిందన్నాడు. యువ ఆటగాళ్లు తనతో కలిసిపోయారని, జట్టులోని ప్రతి ఒక్కరు తనకు ఎంతో సహకరించారని అన్నాడు. తనకు మాట్లాడేందుకు మాటలు కూడా రావడం లేదంటూ ఉద్వేగానికి గురయ్యాడు. తనకు ఎన్నో సలహాలు, సూచనలు అందించి ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు.

ఇకపై శరీరాన్ని కష్టపెట్టదలచుకోలేదన్న గేల్.. ప్రపంచకప్‌ను గెలవకపోయినా జీవితం సాఫీగా సాగిపోతుందన్నాడు. తాను రిటైర్ అయినా జట్టుకు తోడుగా ఉంటానని చెప్పుకొచ్చాడు.

west Indies
chris gayle
icc world cup
  • Loading...

More Telugu News