Andhra Pradesh: నా ఐదేళ్ల హయాంలో ఒక్కసారి కూడా విత్తనాల కొరత రాలేదు!: టీడీపీ అధినేత చంద్రబాబు

  • విత్తనాల సరఫరాలో వైసీపీ సర్కారు విఫలం
  • నెలరోజుల్లోనే విద్యుత్ కొరత లేకుండా చేశా
  • గుంటూరులో మీడియాతో టీడీపీ అధినేత

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం నెలకొన్న విత్తనాల కొరతపై టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు విత్తనాలు అందించడంలో వైసీపీ తీవ్రంగా విఫలమయిందని విమర్శించారు. టీడీపీ హయాంలో ఐదేళ్ల పాటు విత్తన కొరత అన్న సమస్యే రాలేదని చంద్రబాబు గుర్తుచేశారు. 2014 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే రాష్ట్రంలో విత్తనాలు, ఎరువుల కొరత అన్నది లేకుండా చేశామన్నారు.

గుంటూరులో ఈరోజు మీడియాతో చంద్రబాబు పలు అంశాలపై ముచ్చటించారు. టీడీపీ ప్రభుత్వం కారణంగానే విత్తనాల కొరత ఏర్పడిందని వైసీపీ నేతలు చెబుతున్నారనీ, దీన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని వ్యాఖ్యానించారు. ఏపీలో విద్యుత్ కోతల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చంద్రబాబు విమర్శించారు. 

Andhra Pradesh
Chandrababu
Telugudesam
YSRCP
Jagan
Chief Minister
seeds
scarcity
shortage
criticise
  • Loading...

More Telugu News