Salman Khan: సల్మాన్ ఖాన్ కు వార్నింగ్ ఇచ్చిన జోధ్ పూర్ కోర్టు

  • కృష్ణ జింకల వేట కేసు
  • విచారణకు హాజరుకాని సల్మాన్ ఖాన్
  • బెయిల్ రద్దు చేస్తామంటూ కోర్టు వార్నింగ్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కు జోధ్ పూర్ కోర్టు వార్నింగ్ ఇచ్చింది. కృష్ణ జింకల కేసు విచారణకు హాజరుకాని పక్షంలో బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించింది. ఏప్రిల్ లో ఈ కేసుకు సంబంధించిన వాదనలను విన్న కోర్టు తదుపరి విచారణను జూలై 4కు వాయిదా వేసింది. సల్మాన్ ఖాన్ కచ్చితంగా విచారణకు హాజరుకావాలని ఆయన తరపు న్యాయవాదులకు సూచించింది. అయితే, ఈరోజు విచారణకు సల్మాన్ డుమ్మా కొట్టడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వచ్చే వారం కోర్టుకు హాజరుకాకపోతే బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించింది.

Salman Khan
blackbuck
poaching
case
court
bollywood
  • Loading...

More Telugu News