gonuguntla suryanarayana: కార్యకర్తల ప్రాణాలను కాపాడుకోవడానికే బీజేపీలో చేరా: గోనుగుంట్ల సూర్యనారాయణ

  • జగన్ సీఎం అయిన మరుసటి రోజే ఒక కార్యకర్తను చంపేశారు
  • ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా
  • వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట వేస్తా

అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. బీజేపీలో చేరిన తర్వాత తన కార్యకర్తలతో కలసి ధర్మవరంలో తొలిసారి సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా భారీగా తరలి వచ్చిన అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, జగన్ సీఎంగా బాధ్యతలను స్వీకరించిన మరుసటి రోజే ఒక కార్యకర్తను చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తల ప్రాణాలను కాపాడుకోవడానికే తాను బీజేపీలో చేరానని చెప్పారు. దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను విశ్లేషించుకుని పార్టీ మారానని తెలిపారు. టీడీపీని వీడడం గురించి చెబుతున్నప్పుడు భావోద్వేగానికి గురై, ఆయన కంటతడి పెట్టారు.

2024లో జరిగే జమిలీ ఎన్నికల్లో ఏపీలో కూడా బీజేపీ గెలవబోతోందని గోనుగుంట్ల తెలిపారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని... బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. వైసీపీ వర్గీయుల అరాచకాలకు అడ్డుకట్ట వేస్తానని తెలిపారు.

gonuguntla suryanarayana
bjp
Telugudesam
ysrcp
jagan
modi
dharmavaram
  • Loading...

More Telugu News