Sivaji: విదేశాలకు పోయేందుకు నటుడు శివాజీ ఎలా వచ్చాడో తెలుసా?

  • నిన్న విదేశాలకు పోతూ పట్టుబడిన శివాజీ
  • బట్టతలతో సాధారణ వేషధారణకు భిన్నంగా వచ్చిన నటుడు
  • అయినా కనిపెట్టిన  ఇమిగ్రేషన్ అధికారులు

టీవీ9 వ్యవహారంలో నటుడు శివాజీ నిన్న విదేశాలకు వెళ్లే  ప్రయత్నం చేయగా, పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని పలుమార్లు నోటీసులు పంపినా, రాకుండా రెండు నెలలుగా తప్పించుకు తిరుగుతున్న శివాజీ ఎయిర్ పోర్టుకు బట్టతలతో రావడం గమనార్హం.

ఇంతవరకూ శివాజీని ఎవరూ బట్టతలలో మాత్రం చూడలేదు. పైగా కళ్లద్దాలు ధరించాడు. మామూలుగా చూస్తే, అతను శివాజీ అని ఎవరూ గుర్తు పట్టని విధంగా ఎయిర్ పోర్టుకు వచ్చాడు. బ్లూ జీన్స్, బ్లాక్ టీ షర్ట్ ధరించి శివాజీ రాగా, పాస్ పోర్ట్ ను చూసి గుర్తించిన ఇమిగ్రేషన్ అధికారులు, అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన సాధారణ వేషధారణకు భిన్నంగా శివాజీ వచ్చాడని, ఇమిగ్రేషన్ అధికారుల దృష్టిలో పడకుండా శివాజీ చేసిన ప్రయత్నం విఫలమైందని పోలీసు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

Sivaji
TV9
Immigration
Police
Airport
  • Loading...

More Telugu News