ambati rayudu: రాయుడూ, నీవు అత్యున్నతమైన వ్యక్తివి: కోహ్లీ ప్రశంసలు

  • అంబటి రాయుడి రిటైర్మెంట్ పై స్పందించిన కోహ్లీ
  • నీ ప్రయాణం అద్భుతంగా సాగాలంటూ ట్వీట్
  • నిన్న రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడు

అంతర్జాతీయ క్రికెట్ కు తెలుగుతేజం అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఊహించని విధంగా రాయుడు రిటైర్మెంట్ ప్రకటించడం అందరినీ షాక్ కు గురి చేసింది. తాజాగా రాయుడి రిటైర్మెంట్ పట్ల టీమిండియా కెప్టెన్ కోహ్లీ స్పందించాడు. 'నువ్వు అత్యున్నతమైన వ్యక్తివి. నీ ప్రయాణం అద్భుతంగా సాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అంటూ ట్వీట్ చేశాడు.

ప్రపంచకప్ కు రాయుడు ఎంపిక అవుతాడని అందరూ భావించారు. రాయుడు అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. అయితే, ప్రపంచకప్ నుంచి రాయుడిని సెలెక్టర్లు పక్కన పెట్టారు. తొలుత ధావన్ గాయపడ్డ తర్వాత అతని స్థానంలో రిషభ్ పంత్ ను సెలెక్ట్ చేశారు. అనంతరం విజయ్ శంకర్ కూడా గాయపడ్డాడు. ఈ తరుణంలో కూడా రాయుడిని పక్కన పెట్టి... ఒక్క వన్డే కూడా ఆడని మయాంక్ అగర్వాల్ ను ఎంపిక చేశారు. దీంతో, మనస్తాపానికి గురైన అంబటి రిటైర్మెంట్ ప్రకటించాడు.

ambati rayudu
Virat Kohli
cricket
team india
  • Loading...

More Telugu News