England: రెండు దశాబ్దాల తర్వాత తీరిన ఇంగ్లండ్ సెమీస్ కల!

  • 1992లో చివరిసారి సెమీస్‌కు ఇంగ్లండ్
  • తాజాగా కివీస్‌పై గెలుపుతో మరోమారు
  • సెమీ ఫైనల్లో భారత్‌తో తలపడే అవకాశం

ఐసీసీ ప్రపంచకప్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగి, ఆ తర్వాత సెమీస్ అవకాశాలను క్లిష్టం చేసుకున్న ఇంగ్లండ్ తాజాగా సెమీస్‌లోకి ప్రవేశించింది. బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 119 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన ఇంగ్లండ్ దర్జాగా సెమీస్‌లోకి ప్రవేశించింది. ఫలితంగా 27 ఏళ్ల తర్వాత తిరిగి సెమీఫైనల్లోకి అడుగుపెట్టి అభిమానుల్లో ఆశలు రేకెత్తించింది.

ఇంగ్లండ్ చివరిసారి 1992 ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరుకుంది. ఆ తర్వాత మరెప్పుడూ సెమీస్ ముఖం చూడలేదు. తాజాగా, కివీస్‌పై గెలుపుతో 12 పాయింట్లతో మూడోస్థానానికి ఎగబాకింది. ప్రస్తుత సమీకరణాల ప్రకారం సెమీస్ భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

England
icc world cup
semi finals
  • Loading...

More Telugu News