Kanchi: కంచిలో బంగారు బల్లిని ఫొటో తీయబోయిన తెలుగు యువకుడిని దారుణంగా కొట్టిన భద్రతా సిబ్బంది.. మృతి!

  • ఆలయంలోకి కెమెరాతో వెళ్లిన రాజమండ్రి వాసి
  • లాఠీలతో కుళ్లబొడిచిన సెక్యూరిటీ

తమిళనాడులోని ప్రఖ్యాత కంచి కామాక్షమ్మ దేవాలయంలో పోలీసుల దాష్టీకం, ఓ తెలుగు యువకుడి ప్రాణాలను తీసింది. కాస్తంత అత్యుత్సాహంతో ఆలయంలోకి కెమెరాను తీసుకువెళ్లిన ఆకాశ్, అనే యువకుడు, అక్కడ ఉండే బంగారు బల్లి ఫొటోను తీయాలని భావించడమే అతని తప్పైంది. దీన్ని గమనించిన ఆలయ పోలీసు సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అడ్డుకుని, దారుణంగా లాఠీలతో కొట్టారు.

ఈ ఘటనలో ఆకాశ్ కు తీవ్రగాయాలు కాగా, మరణించాడు. ఆకాశ్, రాజమండ్రి వాసిగా తెలుస్తోంది. తెలుగు భక్తుని మృతిపై కంచి దేవాలయంలో ఇతర భక్తులు ఆందోళనకు దిగిన వేళ, కొంత ఉద్రిక్తత నెలకొంది. జరిగిన ఘటనపై సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించి, సెక్యూరిటీ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఆలయ అధికారులు తెలిపారు. 

Kanchi
Gold Lizard
Tamilnadu
Died
Police
  • Loading...

More Telugu News