: అరెస్టయిన బుకీల్లో ఒకరు శ్రీశాంత్ సన్నిహితుడే


స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో అడ్డంగా బుక్కయిన 11 మంది బుకీల్లో జిజు జనార్థన్ అనే వ్యక్తి క్రికెటర్ శ్రీశాంత్ కు సన్నిహితుడని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. కాగా, ఈ కుంభకోణంలో ముంబయి మాఫియా వర్గాల హస్తమున్నట్టు తమ వద్ద సమాచారముందని వారు తెలిపారు. తన కుమారుడి అరెస్టు వెనుక ధోనీ హస్తముందని శ్రీశాంత్ తండ్రి చేసిన ఆరోపణలపై ఢిల్లీ పోలీసు కమిషనర్ నీరజ్ కుమార్ స్పందించారు. ఈ ఉదంతంలో ధోనీ పాత్రేమీలేదని స్పష్టం చేశారు. ఇక తొలుత వార్తల్లో వచ్చినట్టుగా పేసర్ షాన్ టెయిట్ కు ఫిక్సింగ్ లో ప్రమేయంలేదని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News