ram charan: బాలీవుడ్ కు వెళ్తున్న రామ్ చరణ్ చిత్రం

  • బాలీవుడ్ లో రీమేక్ అవనున్న 'ఎవడు' చిత్రం
  • సంయుక్తంగా నిర్మించనున్న దిల్ రాజు, నిఖిల్ అద్వానీ
  • దర్శకత్వం వహించనున్న మిలాప్ జవేరీ

ఈ మధ్య కాలంలో పలు టాలీవుడ్ చిత్రాలు బాలీవుడ్ లో రీమేక్ అవుతున్నాయి. బాలీవుడ్ లో రీమేక్ అయిన 'కబీర్ సింగ్' (తెలుగు 'అర్జున్ రెడ్డి') భారీ హిట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా రామ్ చరణ్, అల్లు అర్జున్ కలసి నటించిన 'ఎవడు' చిత్రం బాలీవుడ్ కు వెళ్తోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు, బాలీవుడ్ నిర్మాత నిఖిల్ అద్వానీలు కలసి రీమేక్ చేయనున్నారు. మిలాప్ జవేరీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. బాలీవుడ్ కు తగ్గట్టుగా ఈ చిత్రంలో స్వల్ప మార్పులు చేయనున్నారట. అయితే రామ్ చరణ్, అల్లు అర్జున్ పాత్రలను ఎవరు పోషించబోతున్నారనే విషయం మాత్రం ఇంకా వెల్లడి కాలేదు.

ram charan
evadu
bollywood
remake
dil raju
  • Loading...

More Telugu News