nagababu: అన్నయ్య నాగబాబుకు కీలక బాధ్యతలను అప్పగించనున్న పవన్ కల్యాణ్

  • సమన్వయ కమిటీ బాధ్యతలను అప్పగించాలని నిర్ణయం
  • క్షేత్ర స్థాయి నాయకులను కలవలేకపోతున్న పవన్
  • ప్రజారాజ్యంలో క్రియాశీలకంగా వ్యవహరించిన నాగబాబు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన చిన్నన్నయ్య నాగబాబుకు కీలక బాధ్యతలను అప్పగించనున్నారు. పార్టీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి, దాని నాయకత్వ బాధ్యతలను నాగబాబుకు ఇవ్వాలని నిర్ణయించారు. నాయకులకు, పార్టీ శ్రేణులకు మధ్య సమన్వయం లేదని గుర్తించిన పవన్... ఈ సమస్యను నాగబాబు నిర్వహించగలరని భావిస్తున్నారు.

క్షేత్ర స్థాయి నాయకులను తాను కలవడానికి వీలు పడకపోవడంతో.... ఆ బాధ్యతను నాగబాబుకు అప్పగిస్తే బాగుంటుందనేది ఆయన ఆలోచన. ప్రజారాజ్యం పార్టీలో కూడా నాగబాబు క్రియాశీలకంగా వ్యవహరించేవారు. కేడర్ కు దగ్గరగా ఉంటూ, కింది స్థాయి నేతలతో తరచూ సమావేశాలను నిర్వహిస్తుండేవారు. ఈ నేపథ్యంలో, నాగబాబుకు కీలక బాధ్యతలను అప్పగించాలనే నిర్ణయానికి పవన్ వచ్చారు.

nagababu
pawan kalyan
janasena
key post
  • Loading...

More Telugu News