mumbai: ముంబైలో మరో ప్రమాదం.. ఆనకట్టకు గండి.. 23 మంది గల్లంతు

  • ముంబైని కుదిపేస్తున్న భారీ వర్షాలు
  • రత్నగిరిలో తెగిన ఆనకట్ట
  • పోటెత్తిన వరదనీటిలో కొట్టుకుపోయిన ఇళ్లు

వరదలతో అతలాకుతలం అవుతున్న ముంబైలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 35 మంది ప్రాణాలు కోల్పోయారు. మరెందరో గాయపడ్డారు. తాజాగా, ఓ ఆనకట్టకు గండిపడి వరద నీరు పోటెత్తడంతో 23 మంది గల్లంతయ్యారు. రత్నగిరిలో ఉన్న తివారీ ఆనకట్టకు గండి పడడంతో వరదనీరు ఒక్కసారిగా సమీపంలోని ఏడు గ్రామాలను ముంచెత్తింది. దీంతో 12 ఇళ్లు కొట్టుకుపోగా, పలువురు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు గల్లంతైన వారి కోసం గాలింపు మొదలుపెట్టాయి. ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలను వెలికి తీశాయి. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

mumbai
heavy rains
Dam
Ratnagiri
  • Loading...

More Telugu News