Ishwarya Rajesh: ‘మిస్ మ్యాచ్’లో పవన్ ‘తొలిప్రేమ’ పాట

  • ఉదయ శంకర్, ఐశ్వర్య రాజేశ్ జంటగా ‘మిస్ మ్యాచ్’
  • రెజ్లింగ్ క్రీడ నేపథ్యంలో రూపొందిన నిర్మల్
  • 19న విడుదలకు సిద్ధమవుతున్న ‘మిస్ మ్యాచ్’

ఎస్వీ నిర్మల్ కుమార్ దర్శకత్వంలో ‘ఆటగదరా శివ’ ఫేం ఉదయ శంకర్, ఐశ్వర్య రాజేశ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మిస్ మ్యాచ్’. రెజ్లింగ్ క్రీడ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో టాలీవుడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే అంశం ఒకటి ఉంది. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ నటించిన ‘తొలిప్రేమ’లోని ఓ పాటను రీమిక్స్ చేశారు.

ఈ చిత్రం ఈ నెల 19న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను చేపట్టింది. దీనిలో భాగంగా ఐశ్వర్య రాజేశ్, చిత్ర యూనిట్‌తో కలిసి హైదరాబాద్ వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమా విశేషాలను మీడియాతో పంచుకుంది. తాను ఇప్పటి వరకూ ఎంపిక చేసుకున్న చక్కని కథల్లో ‘మిస్ మ్యాచ్’ ఒకటని వెల్లడించింది. చిత్రం తప్పక విజయవంతమవుతుందని ఐశ్వర్య ధీమా వ్యక్తం చేసింది.

Ishwarya Rajesh
Uday Shankar
Nirmal Kumar
Pawan Kalyan
Tholiprema
  • Loading...

More Telugu News