Rains: ముంబైలో విషాదం.. వరదల్లో చిక్కుకుని ఇద్దరు స్నేహితుల మృతి

  • అండర్‌పాస్‌లోకి ప్రవేశించిన స్నేహితులు
  • ఇంజిన్‌లోకి నీరు చేరడంతో ఆగిపోయిన కారు
  • కారును స్టార్ట్ చేయడంలో నిమగ్నమైన స్నేహితులు

దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా ముంబైలో వర్షపాతం నమోదవుతున్నట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఎటు వెళ్లాలన్నా వరదలకు బయటకు రాలేక.. వచ్చిన వారు ఇంటికి వెళ్లలేక జనజీవనం స్తంభించి పోతోంది. ఈ నేపథ్యంలో, ఈ భారీ వర్షాలకు అండర్ పాస్‌లో కారు ఇరుక్కుపోయి ఇద్దరు స్నేహితులు ప్రాణాలు కోల్పోవడం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

పోలీసుల కథనం ప్రకారం, ఇర్ఫాన్ ఖాన్(37), గుల్షన్ షేక్(38) సోమవారం అర్థరాత్రి తమ ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో అండర్‌పాస్‌లోకి ప్రవేశించారు. అక్కడ కారు నీటిలో ఇరుక్కుపోవడంతో ఇంజిన్‌లోకి వరద నీరు ప్రవేశించింది. వెంటనే వారు కారును స్టార్ట్ చేసే ప్రయత్నంలో నిమగ్నమవగా పెద్దగా వరద వచ్చేసి కారును పూర్తిగా చుట్టుముట్టేసింది. దీంతో వారిరువురూ బయటకు రాలేక, ఊపిరాడక కొద్ది సేపటికే ప్రాణాలు విడిచారు.

Rains
Mumbai
Irfan Khan
Gulshan Shake
Car Ingene
Under Pass
  • Loading...

More Telugu News