Himalayas: దర్శనమిచ్చిన అమరనాథుడు... పులకించిన భక్తజనం!

  • తొలి బ్యాచ్ లో 2,234 మంది యాత్రికులు
  • 46 రోజులు సాగనున్న యాత్ర
  • భారీ భద్రతా ఏర్పాట్లు

హిమాలయ పర్వత సానువుల్లో వెలసే స్వయంభూ మంచు శివలింగం అమరనాథుడు భక్తులకు దర్శనమిచ్చాడు. నిన్న బల్తాల్ బేస్ క్యాంప్ మీదుగా అమర్ నాథ్ గుహకు చేరుకున్న తొలి బ్యాచ్ భక్తులకు స్వామి మంచురూపంలో కనిపించడంతో పులకించిపోయారు. మొత్తం 2,234 మంది తొలి బ్యాచ్ లో స్వామిని దర్శించుకున్నారని, మొత్తం 46 రోజుల పాటు యాత్ర సాగనుండగా, 1.50 లక్షల మంది రిజిస్టర్ చేయించుకున్నారని అధికారులు తెలిపారు. ఉగ్రదాడులు జరగవచ్చన్న నేపథ్యంలో పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లను చేసినట్టు వెల్లడించారు.

Himalayas
Amarnath
Piligrims
  • Loading...

More Telugu News