Sri Lanka: రెండు భారీ సిక్సులతో పాత గేల్ ప్రత్యక్షం... అంతలోనే అవుట్!

  • శ్రీలంకతో మ్యాచ్ లో కష్టాల్లో విండీస్
  • విండీస్ టార్గెట్ 339 రన్స్
  • 17 ఓవర్లలో 3 వికెట్లకు 82 పరుగులు చేసిన కరీబియన్లు

శ్రీలంకతో మ్యాచ్ లో క్రిస్ గేల్ లో మునుపటి కసి బయటికి వచ్చిందనుకుని అంతా ఆనందిస్తున్న తరుణంలో అవుట్ కావడం తీవ్ర నిరాశకు గురిచేసింది. లంక బౌలర్ రజిత విసిరిన ఇన్నింగ్స్ 14వ ఓవర్లో భారీ సిక్స్ బాదిన గేల్, మళ్లీ అతడి బౌలింగ్ లోనే 16వ ఓవర్లో మరో బంతిని స్టాండ్స్ లోకి పంపాడు. ఆ తర్వాతి బంతిని కూడా గాల్లోకి బలంగా కొట్టినా ఫీల్డర్ క్యాచ్ పట్టడంతో గేల్ కథ ముగిసింది.

339 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన విండీస్ కు గేల్ తనదైన శైలిలో శుభారంభం ఇవ్వలేకపోయాడు. ఓవర్లు కరిగిపోతున్నా గేల్ నిదానంగా ఆడుతుండడంతో అభిమానులు నిరాశపడుతున్న తరుణంలో ఒక్కసారిగా ఊపు పెంచిన విండీస్ వీరుడు కాసేపటికే అవుట్ కావడంతో స్టేడియం సద్దుమణిగింది. గేల్ 48 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ప్రస్తుతం విండీస్ స్కోరు 17 ఓవర్లలో 3 వికెట్లకు 82 పరుగులు. లంక సీనియర్ బౌలర్ లసిత్ మలింగ నిప్పులు చెరిగే బంతులతో వెస్టిండియన్లు 22 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయారు. ప్రస్తుతం క్రీజులో హెట్మెయర్ (28), పూరన్ (3) ఆడుతున్నారు.

Sri Lanka
West Indies
Chris Gayle
World Cup
  • Loading...

More Telugu News