Lok sabha: లోక్ సభ ప్యానెల్ స్పీకర్ గా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి

  • లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఉత్తర్వులు జారీ
  • స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లేని సమయంలో ప్యానెల్ స్పీకర్ కు బాధ్యతలు 
  • ఇప్పటికే లోక్ సభ వైసీపీ పక్ష నేతగా ఉన్న మిథున్ రెడ్డి

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని మరో పదవి వరించింది. ఇప్పటికే లోక్ సభ వైసీపీ పక్ష నేతగా నియమితులైన మిథున్ రెడ్డిని లోక్ సభ ప్యానెల్ స్పీకర్ గా నియమించారు. ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లా ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లేని సమయంలో లోక్ సభకు ప్యానల్ స్పీకర్లలో ఒకరు సభకు అధ్యక్షత వహిస్తారు. కాగా, కడప జిల్లా రాజంపేట నియోజకవర్గానికి మిథున్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Lok sabha
panel speaker
YSRCP
mp
Mithun
  • Loading...

More Telugu News