Andhra Pradesh: చంద్రబాబుకు కావాల్సిన దానికంటే ఎక్కువ భద్రతే కల్పించాం!: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్

  • ఆయనకు భద్రత తగ్గించామనడం సరికాదు
  • సీఎం జగన్ పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు
  • శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోం

ఏపీ ముఖ్యమంత్రి జగన్ శాంతిభద్రతల విషయంలో పోలీసులకు పూర్తిగా స్వేచ్ఛను ఇచ్చారని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు భద్రతను తగ్గించారని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. నిబంధనల ప్రకారం చంద్రబాబుకు ఎంత భద్రత ఇవ్వాలో అంతకంటే ఎక్కువగానే సెక్యూరిటీ కల్పించామని స్పష్టం చేశారు. ప్రత్యేకహోదా సమయంలో ఉద్యమించిన ప్రజలపై కేసుల మాఫీకి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రజల నుంచి వినతులను స్వీకరించేందుకు ప్రభుత్వం ప్రారంభించిన ‘స్పందన’ కార్యక్రమానికి మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తామన్నారు. జిల్లా ఎస్పీ, సీపీ కార్యాలయాల్లో గ్రీవెన్స్ సెల్స్ ఏర్పాటు చేశామని గౌతమ్ సవాంగ్ అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎవరినీ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారనీ, వ్యక్తిగత గొడవలకు కూడా రాజకీయ ముద్ర వేస్తున్నారని సవాంగ్ వ్యాఖ్యానించారు.

Andhra Pradesh
dgp
gautam sawang
Chandrababu
security
  • Loading...

More Telugu News