Ranga Reddy District: కోహెడ వద్ద డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరి మృతి

  • నలుగురికి తీవ్రగాయాలు
  • మృతులు మిర్యాలగూడకు చెందిన వారు
  • శ్రీశైలం వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన

ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కోహెడ వద్ద ఈరోజు తెల్లవారు జామున కారు డివైడర్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు దుర్మరణం పాలవ్వగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన రవీంద్రాచారి కుటుంబ సభ్యులు ఆరుగురు శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్లారు.

తిరుగు ప్రయాణంలో కోహెడ వద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రవీంద్రాచారి (53), సోదరి వినోదమ్మ (61) తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అబ్దుల్లాపూర్‌మెట్‌ సీఐ దేవేందర్‌ సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను హయత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి, మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు.

Ranga Reddy District
koheda
Road Accident
two died
  • Loading...

More Telugu News