Drugs: పాక్ నుంచి స్మగ్లింగ్... రూ. 2,700 కోట్ల హెరాయిన్ పట్టివేత!

  • పాక్ నుంచి రాతి ఉప్పు పేరిట దిగుమతి
  • బస్తాల కింద 532 కిలోల హెరాయిన్
  • ఒకరి అరెస్ట్, మరొకరి విచారణ

ఇండియాను అస్థిర పరచడమే లక్ష్యంగా, పాకిస్థాన్ పన్నిన ఓ కుతంత్రాన్ని భారత భద్రతాదళాలు రట్టు చేశాయి. పాక్‌ నుంచి అక్రమంగా ఇండియాకు వస్తున్న రూ. 2,700 కోట్ల విలువైన హెరాయిన్ ను అట్టారి చెక్‌ పోస్టు వద్ద అధికారులు పట్టుకున్నారు. మొత్తం 532 కిలోల హెరాయిన్ ను నిందితులు తెస్తున్నారని, ఇంటిగ్రేటెడ్‌ చెక్‌ పోస్ట్‌ ను దాటి ఇది అట్టారి చేరుకుందని అధికారులు తెలిపారు.

ఇందులో భారీ ఎత్తున హెరాయిన్, మరో 532 కిలోల అనుమానాస్పద డ్రగ్స్‌ ను వందలాది రాతి ఉప్పు బస్తాల కింద దాచారని పేర్కొన్నారు. రాతి ఉప్పు పేరిట అనుమతులు తీసుకుని, హెరాయిన్ ను దేశంలోకి పంపాలన్నది పాక్ పన్నాగమని వెల్లడించారు. భారత కస్టమ్స్‌ విభాగానికి ఇది పెద్ద విజయమని అధికారులు అంటున్నారు. ఈ కేసులో కాశ్మీర్‌ కు చెందిన హెరాయిన్‌ స్మగ్లర్ తారిఖ్‌ అన్వర్‌ ని అరెస్ట్‌ చేశామని, అమృతసర్‌ లో రాతి ఉప్పును దిగుమతి చేసుకునే వ్యక్తిని ప్రశ్నిస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News