Renuka Chowdary: బ్లడ్ క్యాన్సర్ తో మృతిచెందిన మల్లు రమేశ్ పాడె మోసిన రేణుకా చౌదరి

  • స్నానాల లక్ష్మీపురంలో అంత్యక్రియలు
  • హాజరైన కాంగ్రెస్ నేతలు
  • రమేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన రేణుకా చౌదరి

పీసీసీ మాజీ అధ్యక్షుడు మల్లు అనంతరాములు తనయుడు, ఏఐసీసీ మాజీ సభ్యుడు మల్లు రమేశ్ బ్లడ్ క్యాన్సర్ తో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి అనుచరుడిగా గుర్తింపు పొందారు. తన సన్నిహితుడు మరణించడంతో రేణుకా చౌదరి విషాదంలో మునిగిపోయారు. ఇవాళ మల్లు రమేశ్ అంత్యక్రియలు ఖమ్మం జిల్లాలోని స్నానాల లక్ష్మీపురంలో జరిగాయి. అంత్యక్రియలకు హాజరైన రేణుకా చౌదరి తన అనుచరుడు మల్లు రమేశ్ పాడె మోశారు. రమేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆమె వారిని ఓదార్చారు. మల్లు రమేశ్ అంత్యక్రియలకు  మల్లు భట్టి విక్రమార్క, ఇతర కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. మల్లు రమేశ్, భట్టి విక్రమార్క అన్న కుమారుడే!

Renuka Chowdary
Congress
  • Loading...

More Telugu News