Virat Kohli: లక్ష్యఛేదనలో నిదానంగా... టీమిండియా 74/1

  • కేఎల్ రాహుల్ డకౌట్
  • ఆచితూచి ఆడుతున్న కోహ్లీ, రోహిత్
  • పెరిగిపోతున్న సాధించాల్సిన రన్ రేట్

బర్మింగ్ హామ్ లో 338 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా నిదానంగా ఆడుతోంది. ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తుండడంతో 19 ఓవర్లు ముగిసేసరికి భారత్ 1 వికెట్ నష్టానికి 74 పరుగులు చేసింది. రన్ రేట్ 3.94 కాగా, సాధించాల్సిన రన్ రేట్ 8 దాటింది. క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ (43), రోహిత్ శర్మ (31) ఉన్నారు. ఓపెనర్ రాహుల్ డకౌట్ కావడంతో ఇన్నింగ్స్ ఆరంభంలోనే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. అయితే, భారీ లక్ష్యం ముందుడడంతో కోహ్లీ, రోహిత్ జోడీ భారీ షాట్ల జోలికి వెళ్లకుండా క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. టీమిండియా గెలవాలంటే 31 ఓవర్లలో 264 పరుగులు సాధించాలి.

  • Loading...

More Telugu News