Asifabad: అటవీశాఖ సిబ్బందిపై దాడి ఘటన.. కాగజ్ నగర్ డీఎస్పీ, రూరల్ సీఐ సస్సెన్షన్!

  • దాడి సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణ
  • కాగజ్ నగర్ డీఎస్పీ సాంబయ్య, రూరల్ సీఐ వెంకటేశ్ సస్పెండ్
  • వరంగల్ రేంజ్ ఐజీ నాగిరెడ్డి ఆదేశాలు

అసిఫాబాద్ జిల్లాలోని సార్సాలాలో అటవీశాఖ సిబ్బందిపై దాడి ఘటన నేపథ్యంలో పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. కాగజ్ నగర్ డీఎస్పీ సాంబయ్య, రూరల్ సీఐ వెంకటేశ్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ రేంజ్ ఐజీ నాగిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ దాడి జరిగిన సమయంలో డీఎస్పీ, సీఐలు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ వారిపై చర్యలు తీసుకున్నారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అనుచరులు అటవీ శాఖ అధికారిణిపైనే కాకుండా తమ పైనా విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారని ఫారెస్ట్ సిబ్బంది ఆరోపించారు. సంఘటనా స్థలానికి వచ్చిన కోనేరు కోనప్ప ఘర్షణను నిలువరించాల్సిందిపోయి అటవీశాఖ సిబ్బందిని తప్పుబట్టారని ఆరోపించారు.

Asifabad
Forest
sarsala
kagaznagar
mla
  • Loading...

More Telugu News