Andhra Pradesh: రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన ‘ప్రజా దర్బార్’ వాయిదా

  • ఆగస్టు 1 నుంచి ‘ప్రజాదర్బార్’ 
  • అసెంబ్లీ సమావేశాలన్నీ పూర్తయ్యాక నిర్వహిస్తాం
  • మంత్రి కన్నబాబు వెల్లడి

ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రజాదర్బార్ కార్యక్రమాన్నినిర్వహిస్తామని ఏపీ సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, వాస్తవానికి జూలై 1 నుంచి ప్రారంభం కావాల్సిన ‘ప్రజాదర్బార్’ పై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో మంత్రి కన్నబాబు స్పందించారు. ఏపీ మంత్రి వర్గ ఉపసంఘం భేటీ అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీ సమావేశాలన్నీ పూర్తయ్యాక ఆగస్టు 1 నుంచి ‘ప్రజాదర్బార్’ ప్రారంభించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. కాగా ప్రజా దర్బార్ కు సంబంధించిన కార్యాలయం, ఇందుకు సంబంధించిన పనులు పూర్తి కాలేదని సమాచారం.

  • Loading...

More Telugu News