Telangana: కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రా? ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రా?: జీవన్ రెడ్డి

  • తెలంగాణకు చెందిన నీటిని ఆంధ్రాకు ఎలా తరలిస్తారు?
  • నాడు రాయలసీమకు నీళ్లిస్తామంటే విమర్శించారు
  • ఇప్పుడెలా మద్దతిస్తారు?

తెలంగాణ, ఆంధ్రా సీఎంల సమావేశంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ పై టీ-కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి విమర్శలు చేశారు. సమైక్యవాది, విభనవాదుల సమావేశం ముచ్చటేస్తోందని సెటైర్లు విసిరారు. కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రా? ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రా? తెలంగాణ రాష్ట్రానికి చెందిన నీటిని ఆంధ్రాకు తరలిస్తామని ఎలా అంటారు? అని ప్రశ్నించారు.

తాము రాయలసీమకు నీళ్లిస్తామంటే, ఆంధ్రోళ్లకు నీళ్లు దోపిడీ చేస్తున్నారని విమర్శించారని, నీళ్ల తరలింపునకు ఇప్పుడెలా మద్దతిస్తారని మండిపడ్డారు. ప్రాణహిత నది పుట్టిన ఆదిలాబాద్ జిల్లాకు నీ ప్లాన్ ఏది? ఎస్ఎల్ బీసీ టన్నెల్ పనులు ఏమయ్యాయి? దీని గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. సమైక్యవాదులతో చర్చలు అంటే తెలంగాణ ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టడమేనని విమర్శించారు.

  • Loading...

More Telugu News