karimnagar: కాలినడకన కొండగట్టు అంజన్న ఆలయానికి ఎంపీ బండి సంజయ్‌కుమార్
- గెలిచాక మొక్కుతీర్చుకున్న లోక్‌సభ సభ్యుడు
- 37 కిలోమీటర్ల దూరం...12 గంటల ప్రయాణం
- గెలిస్తే నీ గుడికి వస్తానని మొక్కుకున్న ఎంపీ
ఎన్నికల వేళ నమ్మే దేవుడు, నమ్మకం ఉన్న దేవుడిని కోరికలు కోరుకోవడం, ముడుపులు కట్టడం సర్వసాధారణం. సామాన్యులైనా, ప్రజాప్రతినిధులైనా ఫలితం వచ్చాక ఆ మొక్కు తీర్చుకుంటారు. కరీంనగర్ నుంచి గెలుపొందిన భారతీయ జనతా పార్టీ ఎంపీ బండి సంజయ్‌కుమార్ కూడా అలాగే మొక్కుతీర్చుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గెలిస్తే నీ కొండకు వస్తానని కొండగట్టు అంజన్నను వేడుకున్నారు.
దీంతో నిన్న ఉదయం తన ఇంటి నుంచి కాలినడకన బయలుదేరారు. 7.30 గంటలకు కరీంనగర్ మహాశక్తి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం కాలినడక ప్రారంభించారు. కొత్తపల్లి, రామడుగు, గంగాధర, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలాల మీదుగా దాదాపు 37 కిలోమీటర్ల దూరాన్ని నడిచి రాత్రి 7 గంటలకు కొండగట్టు అంజన్న సన్నిధికి చేరుకుని మొక్కు చెల్లించుకున్నారు.