Pakistan: పాక్, ఆఫ్గన్ మ్యాచ్ మధ్యలో బెలూచ్ బ్యానర్ తో వచ్చిన విమానం... కొట్టుకున్న అభిమానులు!

  • 'జస్టిస్ ఫర్ బలుచిస్తాన్' అనే భారీ బ్యానర్ తో విమానం
  • మ్యాచ్ మధ్యలో మైదానంపై నుంచి వెళ్లిన వైనం
  • ఆపై అభిమానుల మధ్య గొడవ

నిన్న హెడ్డింగ్లే వేదికగా జరిగిన పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్ మధ్య పోరులో ఓ ఘటన తీవ్ర కలకలం రేపగా, ఇరు దేశాల అభిమానులు బాహాబాహీకి దిగారు. మ్యాచ్ జరుగుతున్న వేళ, 'జస్టిస్ ఫర్ బలుచిస్తాన్' అనే భారీ బ్యానర్ రాసివున్న ఓ విమానం మైదానం పైనుంచి వెళ్లింది. దీన్ని ఎవరో ఆఫ్గన్ అభిమానులు పంపారు. ఈ విమానం మైదానం పై నుంచి వెళ్లిన తరువాత పాక్, ఆఫ్గన్ ఫ్యాన్స్‌ మధ్య గొడవ జరగింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటుంటే, సెక్యూరిటీ సిబ్బంది వారిని స్టేడియం వెలుపలికి పంపారు. అక్కడ కూడా వారు కొట్టుకున్నారు. భద్రతా సిబ్బంది వారిస్తున్నా వారు వినలేదు. చేతికి దొరికిన వస్తువులతో పరస్పరం దాడి చేసుకున్నారు. అదనపు బలగాలను పిలిపించిన అధికారులు, వారిని చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది.

Pakistan
Afghanisthan
Beluchistan
Fans
Cricket
  • Loading...

More Telugu News