Madhya Pradesh: బీజేపీ నేతలకు మధ్యప్రదేశ్ సీఎం సవాల్

  • బీజేపీ నేతలకు కమల్‌నాథ్ కౌంటర్
  • వారికి గట్స్ ఉంటే తన ప్రభుత్వాన్ని కూల్చివేయాలని సవాలు
  • పిచ్చి మాటలు మాట్లొడద్దని సూచన

బీజేపీ నేతలకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సవాలు విసిరారు. రాష్ట్రప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మానుకోవాలని హెచ్చరించారు. బీజేపీ నేతలకు దమ్ముంటే తన ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించాలని సవాలు విసిరారు. ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ పిచ్చిమాటలు మాట్లాడడం మానుకోవాలని సూచించారు. ‘‘బీజేపీ నేతలకు గట్స్ ఉంటే నా ప్రభుత్వాన్ని కూల్చేయాలి’’ అని కమల్ నాథ్ సవాలు విసిరారు. ఆ పార్టీ కార్యకర్తల్లో నైతిక స్థయిర్యాన్ని పెంచేందుకే బీజేపీ నేతలు అలా మాట్లాడుతున్నారని కమల్ నాథ్ విమర్శించారు.

Madhya Pradesh
Kamal nath
BJP
Congress
  • Loading...

More Telugu News