Call money: విజయవాడలో మరోమారు కాల్‌మనీ పడగ

  • అప్పులిచ్చి ఆస్తులు రాయించుకున్నారంటూ ఆరోపణ
  • మనస్తాపంతో ఒంటిపై పెట్రోలు పోసుకున్న వ్యక్తి
  • ఆర్పేందుకు ప్రయత్నించిన కుమార్తెకూ గాయాలు

కొన్నేళ్ల క్రితం విజయవాడలో జడలు విప్పిన కాల్‌మనీ భూతం మళ్లీ కలకలం రేపింది. అప్పులిచ్చి ఆస్తులు రాయించుకుని బాధితులను రోడ్డున పడేస్తున్న కాల్‌మనీ వ్యవహారం అప్పట్లో పెను దుమారం రేపింది. తాజాగా మళ్లీ అటువంటి ఘటనే జరిగింది. వడ్డీలు కట్టడం లేదని కొందరు వడ్డీ వ్యాపారులు తమ ఆస్తులు రాయించుకున్నారంటూ బాధితులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఓ బాధితుడు మనస్తాపంతో ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించిన అతడి కుమార్తెకు కూడా మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన చుట్టుపక్కల వారు మంటలు ఆర్పి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరూ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Call money
Vijayawada
Andhra Pradesh
  • Loading...

More Telugu News