Venu Madhav: కమెడియన్ వేణుమాధవ్ సోదరుడు విక్రమ్ బాబు మృతి

  • గుండెపోటుకు గురైన విక్రమ్ బాబు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
  • ఈ సాయంత్రం అంత్యక్రియలు పూర్తి

టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవ్ సోదరుడు విక్రమ్ బాబు గుండెపోటుతో మరణించారు. విక్రమ్ బాబు శుక్రవారం గుండెపోటుకు గురికాగా, ఆయనను వెంటనే ఈసీఐఎల్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. 54 ఏళ్ల విక్రమ్ బాబు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొనసాగుతున్నారు. ఆయన కొన్ని చిత్రాలకు సహనిర్మాతగానూ వ్యవహరించారు.

కాప్రా హెచ్ బీ కాలనీలోని మంగాపురంలో నివాసముంటున్న విక్రమ్ బాబుకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కొన్నిరోజుల క్రితమే విక్రమ్ బాబు కుమార్తె పెళ్లి జరిగింది. తన ఇంట శుభకార్యం జరిగిన కొన్నిరోజుల్లోనే ఆయన కన్నుమూయడం అందరినీ కలచివేసింది. ఈ సాయంత్రం లక్ష్మీనగర్ శ్మశానవాటికలో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు.

Venu Madhav
Vikram Babu
Tollywood
  • Loading...

More Telugu News