Priyanka Gandhi: యూపీలోని శాంతి భద్రతలపై ప్రియాంక ట్వీట్.. నేరస్తుల జాబితాతో పోలీసుల కౌంటర్

  • 9,225 నేరస్తులను అరెస్టు చేశాం
  • నేరాలు 20-30 శాతం తగ్గాయి
  • ప్రజల నమ్మకాన్ని సంపాదించుకున్నాం

కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ట్వీట్‌కి ఉత్తరప్రదేశ్ పోలీసులు కౌంటర్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని శాంతి భద్రతలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ప్రియాంక, రాష్ట్రంలో నేరగాళ్లు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారని, నేరగాళ్ల ఎదుట యూపీ ప్రభుత్వం లొంగిపోయిందేమోననే విషయం తెలుసుకోవాలనుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు.

దీనిపై స్పందించిన యూపీ పోలీసులు రెండేళ్లలో అదుపులోకి తీసుకున్న నేరస్తుల జాబితాతో ప్రియాంక ట్వీట్‌కు సమాధానమిచ్చారు. ఈ రెండేళ్లలో తీవ్రమైన నేరాలకు సంబంధించి 9,225 నేరస్తులను అరెస్టు చేశామని తెలిపారు. రాష్ట్రంలో దోపిడీ, హత్యలు, కిడ్నాపుల వంటి నేరాలు 20-30 శాతం తగ్గాయని పేర్కొన్నారు. నేరస్థుల పట్ల కఠిన చర్యలు తీసుకుంటూ ప్రజల నమ్మకాన్ని సంపాదించుకున్నామని ప్రియాంక ట్వీట్‌కు సమాధానంగా పోలీసులు తెలిపారు.   

Priyanka Gandhi
Uttar Pradesh
Crime
UP Police
Twitter
  • Loading...

More Telugu News