Naveena: కుటుంబ కలహాలు.. ఇద్దరు పిల్లలతో కలసి కాలువలోకి దూకిన మహిళ

  • పాప, బాబుతో కలిసి కాలువలోకి దూకిన నవీన
  • కూతురు నిత్యనందిని మృతదేహం లభ్యం
  • నవీన, బాబు కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు

కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వసంతవాడ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన నవీనకు ఒక పాప, బాబు ఉన్నారు. నేడు ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి లొల్లలాకుల వద్ద కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సాయంతో వెదికించగా కుమార్తె నిత్యనందిని మృతదేహం లభ్యమైంది. నవీన, ఆమె కుమారుడి జాడ తెలియరాలేదు. ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్యతో గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యలకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు విచారణ జరుగుతోంది.

Naveena
Godavari
Nitya Nandini
Police
West Godavari District
  • Loading...

More Telugu News