Rape: ఐదేళ్ల బాలికపై బాలుడి అత్యాచారం కేసు: తీర్పును వెలువరించిన రంగారెడ్డి జిల్లా కోర్టు
- 2015లో అత్యాచారానికి పాల్పడిన 12 ఏళ్ల బాలుడు
- కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బాలుడి అరెస్ట్
- మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు
ఐదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి మూడు నెలల జైలు శిక్ష, మరో మూడు నెలల పాటు సామాజిక సేవ చేయాలంటూ కోర్టు తీర్పును వెలువరించింది. అత్యాచారం కేసులో కోర్టు ఇంత చిన్న శిక్షతో సరిపెట్టడానికి కారణం అతను మైనర్ బాలుడు కావడమే. 2015లో ఐదేళ్ల చిన్నారిపై 12 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన తీర్పును నేడు రంగారెడ్డి జిల్లాలోని జువైనల్ కోర్టు వెలువరించింది. బాలుడిని దోషిగా తేల్చిన కోర్టు అతడికి మూడు నెలల జైలు శిక్షతో పాటు మరో మూడు నెలల పాటు సామాజిక సేవ చేయాలంటూ తీర్పును వెలువరించింది.