Virat Kohli: కోహ్లీని నాకు వదిలిపెట్టండి, నేను అవుట్ చేస్తా: ఇంగ్లాండ్ ఆటగాడి ధీమా

  • టీమిండియాకు పరుగులు రాబట్టేందుకు కోహ్లీ ఉన్నాడు
  • అతడి పనిబట్టేందుకు నేనున్నా
  • స్వదేశంలో భారత ఆటగాళ్లు సూపర్ స్టార్లు

ఇంగ్లాండ్ ఆటగాడు మొయిన్ అలీ టీమిండియా సారథి విరాట్ కోహ్లీ విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్నాడు. భారత జట్టుకు పరుగులు రాబట్టేందుకు కోహ్లీ ఉన్నాడని, అతడ్ని అవుట్ చేసేందుకు తానున్నానని వ్యాఖ్యానించాడు. తమ తదుపరి మ్యాచ్ భారత్ తోనే ఆడబోతున్నామని, ఒత్తిడంతా వరుసగా గెలుస్తున్న భారత్ పైనే ఉంటుందని అన్నాడు. భారత ఆటగాళ్లు స్వదేశంలో సూపర్ స్టార్లు అని, ఒత్తిడికారణంగా రేపటి మ్యాచ్ లో ఓడిపోతే అది వారి సాధారణ జీవితంపై కూడా ప్రభావం చూపుతుందని మొయిన్ అలీ ఓ బ్లాగులో పేర్కొన్నాడు.

ఇప్పటివరకు కోహ్లీని మొయిన్ అలీ 6 పర్యాయాలు అవుట్ చేశాడు. ఇప్పుడా ధీమాతోనే మాటలతో రెచ్చిపోతున్నట్టు అర్ధమవుతోంది. అయితే కోహ్లీ భీకరఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ వరల్డ్ కప్ లో నాలుగు ఫిఫ్టీలతో సత్తా చాటాడు.  ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కోహ్లీ, మొయిన్ మైదానం వెలుపల మంచి స్నేహితులు. ఇద్దరూ ఐపీఎల్ లో ఒకే జట్టుకు ఆడుతున్నారు. రాయల్ చాలెంజర్స్ టీమ్ కు కోహ్లీ కెప్టెన్ కాగా, మొయిన్ అలీ అదే జట్టులో బ్యాట్స్ మన్.

Virat Kohli
Moeen Ali
World Cup
India
England
  • Loading...

More Telugu News